తత్కాల్ పథకం కింద జనవరి 10 వరకు చెల్లింపు! 14 d ago
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తత్కాల్ పథకం కింద పదోతరగతి పబ్లిక్ పరీక్షలకు ఫీజు గడువును పొడిగిస్తూ ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు కేవీ శ్రీనివాసులు రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. రూ. వెయ్యి ఫీజుతో తత్కాల్ కింద ఈ నెల 27 నుంచి జనవరి 10 వరకు అవకాశం కల్పించారు. ఆన్‌లైన్‌లో ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లు ఫీజు చెల్లించాలని సూచించారు.